ఎస్ జి ఎఫ్ మహబూబాబాద్ జోన్ సెక్రటరీ గా మహంకాళి వెంకటేశ్వర్లు

మహాతెలంగాణ/మహబూబాబాద్

ఎస్జిఎఫ్ మహబూబాబాద్ జోన్ సెక్రటరీ గా మహంకాళి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఈనెల 12న రోజున మహబూబాబాద్ లయన్స్ క్లబ్ భవనం నందు జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జోన్ పరిధిలో మహబూబాబాద్,గార్ల, బయ్యారం మండలాలకు సంబంధించిన అన్ని యాజమాన్యాల వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కంబాలపల్లి వ్యాయామ ఉపాధ్యాయులు మహంకాళి వెంకటేశ్వర్లను 2026- 27 విద్యా సంవత్సరం గాను మహబూబాబాద్ జోనల్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జోన్ లో గల అన్ని యాజమాన్యాల వ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యదర్శిని అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *