జిల్లా జడ్జి మురళీమోహన్
మహా తెలంగాణ/మరిపెడ:
పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కోర్టు పనులను వేగవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా జడ్జి మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మరిపెడలోని నూతన కోర్టు ఏర్పాట్లను పరిశీలించారు. కోర్టు నిర్వహణకు అవసరమైన వసతులు, ఇతర ఏర్పాట్లపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ,పీపీ వెంకటయ్య, కోర్టు ఏఓ శ్రీనివాస్,స్థానిక న్యాయవాదులు,సీఐ పవన్ కుమార్,ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.