ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసింది

మానుకోటలో బీఆర్ఎస్ పోరుబాటలో టిఆర్ఎస్ నేతలు

మహాతెలంగాణ /మహబూబాబాద్

ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పేరుతో మహబూబాబాద్ లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి.. హామీల పేరుతోx తెలంగాణను డిస్ట్రక్షన్ చేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి లేరు.. రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములని తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, నేడు తమ హక్కుల కోసం ఉద్యోగులే రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు చేశారు. పి ఆర్ సి అమలు చేయాలి.. ఐదేళ్లకోసారి జీతాలు పెంచడం ఉద్యోగుల హక్కు అని ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఈ నెల 29న కలెక్టరేట్ల ముందు ఉద్యోగస్తులు ధర్నాలకు సిద్ధమవుతున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని,ఉద్యోగులకు ఆరు నెలలకోసారి డీఏ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాకేష్ రెడ్డి అన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఒపి ఎస్ అమలు చేయాలని, 317 జీవోను సవరించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని అయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి ఇ హెచ్ ఎస్ పేరుతో కోతలు వేస్తున్నప్పుడు.. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని గుర్తుచేశారు.

మాజీ ఎంపిక మాలోత్ కవిత మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులు ఉద్యమకారులని, ఉద్యమంలో సైతం వారి పాత్ర ఉందని ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక పిఆర్సి 43% ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, రాళ్ళ సాక్షిగా ప్రారంభం అయిన ఏ ఉద్యమం వెనకడుగు వేయలేదని, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సూచనల మెరకు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి ఉద్యోగుల హక్కులు సాధిస్తామన్నారు.. ఫ్యూచర్ సిటీ మీద, మూసి ప్రక్షాళన మీద ఉన్న శ్రద్ధ, హైడ్రా కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ పాలన మీద, ప్రజల మీద, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల లేదని ధ్వజమెత్తారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన నిలుస్తున్న రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయడంకా మోగించాలని మాలోత్ కవిత పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూరిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని,సీపీఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు. విద్యార్థుల మీద పోలీసులు దాడి చేయడం మంచిది కాదని,తక్షణమే జీవో 97 రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రం దిగొచ్చే వరకు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు విద్యార్ది శక్తి వదిలి పెట్టలేదు. ఎవరైనా విద్యార్ది శక్తి ముందు తల వంచక తప్పదని ఆయన హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యుగుల సంఘం జిల్లా అధ్యక్షులు, ఈశ్వర్ కుమార్, తెలంగాణ పెన్షన్స్ అసోసియేషన్ రూపిరెడ్డి వెంకట్ రెడ్డి, బద్రి నారాయణ , గోవర్ధన్, మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్వాయ్ రామ్ మోహన్ రెడ్డి, యువనాయకులు యార్ల మురళీధర్ రెడ్డి, ముఖ్య వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *