మహా తెలంగాణ/మరిపెడ:
చదువుకునే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నడుచుకోవడం వెలగడం తోనే విజయం సాధించడం సాధ్యమని మరిపెడ సిఐ పవన్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తో కలిసి మండల పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ను సందర్శించి విద్యార్థులకు సైబర్ నేరాలు,గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగం,వాటి దుష్ప్రభావాల వంటి అంశాల పైన అవగాహన కల్పించారు. పిల్లలను నైతిక ప్రవర్తన గురించి తెలుపుతూ ఇటీవల చోటు చేసుకున్న ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూప రెడ్డిని, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దాడి చేసి హత్య చేసిన విషయం,ఆంధ్రప్రదేశ్ విజయనగరం లో తల్లి స్పందనను హత్య చేసిన కుమారుడు గురించి,కేరళలో 13 సంవత్సరాల బాలిక తాతను,బాలిక ప్రియుడు హత్య చేసిన అంశం ఉదాహరణలుగా చెబుతూ, పిల్లలు నేరం చేయుటకు కారణాలు వివరిస్తూ నేర ప్రవృత్తి కలిగి ఉండకుండా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రపంచంలో అత్యధిక యువత గలిగిన దేశం భారత దేశం అని,నేటి విద్యార్థుల చేతిలో దేశ భవిష్యతు ఉన్నందున,ఏ విధంగా క్రమశిక్షణతో మెలగాలో సూచనలు ఇస్తూ ప్రేరణ కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంమోహన్,వైస్ ప్రిన్సిపాల్ రాజకుమార్,వ్యాయామ ఉపాధ్యాయులు బాలు,మహేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.