టీజీఇజాక్ మహబూబాబాద్*
మహాతెలంగాణ/మహబూబాబాద్:
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగులు గెజిటెడ్, అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా పెన్షనర్స్ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. టీజీఈ జాక్ మహబూబాబాద్ జిల్లా చైర్మన్ వడ్డెబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండో పిఆర్సి అమలు, పెండింగ్ లో ఉన్న ఆరు డి ఏ ల విడుదల, సిపిఎస్ రద్దు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలు నెలకు 2000 కోట్లు నిధుల విడుదల చేయడం, ఈహెచ్ఎస్ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం వంటి అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో ఆ సమస్యలను పరిష్కరించాలని ఈనెల 27 తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన, నవంబర్ ఒకటవ తేదీన పెన్షన్ విద్రోహ దినము అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు 27 తేదీన నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జాక్ సెక్రెటరీ జనరల్ మహమ్మద్ రఫీ నాయకులు బి గీత, ఎస్ మల్లారెడ్డి, ఏ మురళి కృష్ణ, బలాష్టి రమేష్, గన్నోజు ప్రసాద్, మైస నాగయ్య దేవేందర్ రాజు, కరణ్ సింగ్ అవునూరి రవి, మోబిన్, ఈశ్వర్ కుమార్, ఎస్.కె యాకూబ్, రాచకొండ ఉపేందర్, బి హరి, జి బిక్షపతి, ఎస్ రామలింగారెడ్డి, మైస రోహిత్ తదితరులు పాల్గొన్నారు.