మానుకోట గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ట
మహాతెలంగాణ/మహబూబాబాద్:
[మహబూబాబాద్ పట్టణ గంగపుత్ర సంఘం యొక్క చిరకాల వాంఛ అయినటువంటి గంగమ్మ తల్లి విగ్రహ స్థాపనకు కొత్తగా నిర్మాణం చేసిన గంగమ్మ తల్లి గుడిలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుటకు బుధవారం వేణుగోపాలస్వామి గుడి దగ్గర నుంచి గంగమ్మ తల్లి యొక్క శోభాయాత్ర పట్టణ వీధుల గుండా ఎంతో శోభాయ మానంగా భక్తుల ఆరాధన మధ్య భక్తి పరవశ్యం తో కొనసాగింది. దారి పొడవునా బెస్తకులస్థులు, భక్తులు గంగమ్మ తల్లి విగ్రహం ముందు నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయలు సమర్పిస్తూ భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సొసైటీ గౌరవ అధ్యక్షులు మైస నాగయ్య ఆధ్వర్యంలో పట్టణ గంగపుత్ర సంఘ గౌరవ సలహాదారు కన్వీనర్ అయిన డోలి సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో పట్టణ గంగపుత్ర సంగాధ్యక్షులు దేశ బోయినవెంకటస్వామి, కోశాధికారి దేశబోయిన అనిల్, ప్రధాన కార్యదర్శి కందరబోయిన ఉపేందర్, చుక్కల నరేష్, అనిల్, ఆవారి సునీల్, అవారి శ్రీనివాస్, డోలి కృష్ణ, గోపురాజు, చుక్కల కనకయ్య, మద్దెర్ల రాజన్న, దేశాబోయిన విజయ్ తదితరులు పాల్గొన్నారు.