ముల్లంగి ప్రతాపరెడ్డి- కల్లూరి ప్రభాకర్,
మహాతెలంగాణ/మహబూబాబాద్:
మేజర్ ధ్యాన్ చంద్ జీవితం ప్రతి క్రీడాకారునికి ప్రేరణ కావాలని బాస్కెట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ ముల్లంగి ప్రతాపరెడ్డి, బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కల్లూరి ప్రభాకర్ అన్నారు. మేజర్ చంద్ జన్మదినం పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం మహబూబాద్ జూనియర్ కళాశాల ఆవరణలో బాస్కెట్బాల్ గ్రౌండ్ లో బేస్ బాల్ అసోసియేషన్, బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా జీవిత చరిత్ర ప్రతి క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రతి క్రీడాకారుడు ధ్యాన్ చంద్ క్రీడా స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ చీకటి చంద్రన్న, జిల్లా కోచి వెలిశాల కుమారస్వామి, జిల్లా తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు చాంప్లా నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి ఆవారి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయక్, మహబూబాబాద్ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం కల్చరల్ సెక్రటరీ జెక్కి నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ పిల్లి కాశీనాధ్, బాస్కెట్బాల్ సీనియర్ క్రీడాకారులు యాకన్న, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.