మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పిలుపు
వారం రోజులు దశలవారి కార్యక్రమాలు
కాంగ్రెస్ ది అభయ హస్తం కాదు బస్మాసుర హస్తం
మహాతెలంగాణ/ మహబూబాబాద్:
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లపై తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పాలనపై సెప్టెంబర్ 2 నుంచి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజులు పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టిఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతుసోదరులు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెసు ది అభయ హస్తం కాదని భస్మాసుర హస్తమని, ఎన్నికల ముందు 2023లో తుక్కుగూడ సభలో సోనియా గాంధీ 6 గ్యారంటీలు, డిక్లరేషన్ లపై వంద రోజుల్లో అమలు చేస్తామని, మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి 1000 రోజులు పాలన పూర్తయినా నేటి వరకు హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పై తులం బంగారం ఇస్తామని మోసం, 500 కే గ్యాస్ పై మోసం, రైతు భరోసాలో ద్రోహం, రెండు లక్షల రుణమాఫీ 40% కూడా పూర్తి కాలేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లపై మోసం, ఉద్యోగులకు పిఆర్సి, 317 జీవో పై రద్దు, 6డిఏ ల పై మోసం, గృహ జ్యోతి 200ల యూనిట్లు పై మోసం, పూర్తికాని ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు తిరుగుబాటు ఎగరేయాలని అని పిలుపునిచ్చారు ప్రతి మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని వారం రోజులపాటు వివిధ దశల్లో జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండున తాసిల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు దారి పొడవునా పెద్ద బ్యానర్ తో కాంగ్రెస్ మోసం చేసిన హామీలను బ్యానర్ పై వివరిస్తూ ర్యాలీ ఉంటుందని కార్యకర్తలు సైనికుల్లా పనిచేసే కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించడంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కేసముద్రం మండలం నారాయణపురంలో గతంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన పాసుబుక్కులను నేడు కాంగ్రెస్ మంత్రి రైతులకు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు యాకూబ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎమ్ డి ఫరీద్, మాజీ జడ్పిటిసి కాశీం, తేళ్ల శ్రీను, ఆవుల వెంకన్న, రంజిత్ అశోక్, మహేందర్ రెడ్డి, నజీర్, శేఖర్, నరేష్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.