ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
మహాతెలంగాణ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం క్లబ్ నందు ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించి శక్తిని పెంచేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వేస్ట్ నుండి బెస్ట్ గా రూపొందించిన కళాకృతులను చూసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.