భూభారతి చట్టం రెవిన్యూ అవగాహన సదస్సులో తెలంగాణ మంత్రులు

బుధవారం గోవిందరావుపేట మండల
కేంద్రం లోని రైతు వైదిక లో మంత్రి సీతక్కతో పాటు ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పాల్గొని భూభారతి చట్టం రెవిన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు**రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*పేద బడుగు, బలహీన, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు,రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, కంబాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ, బయ్యారం మండల కేంద్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కోసం భూమి పూజ చేసి, గొల్లగూడెం బ్రిడ్జి , బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన, కొత్తపేట గ్రామంలో 3. కోట్ల20 ఐదు లక్షలతో హాస్టల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తు ఉందని అన్నారు, గతం 10 సంవత్సరాలలో సొంత ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరుగుతుందని అన్నారు, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500, 1వెయ్య కలిపి 4500 ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అనంతరం విడతల వారీగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు,రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు చేయడం రైతు రుణమాఫీ రైతు బీమా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు, మహిళా సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పెట్రోల్ పంపులు నిర్వహణ, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయడం జరిగిందని,ఆరు గ్యారెంటీ ల ద్వారా అన్ని వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు,బయ్యారం మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారురాలు బరిగెల ఉపేంద్ర భర్త ఉపేందర్ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసి వారికి నూతన వస్త్ర లను అందజేశారు, వేగంగా ప్రభుత్వ సూచించిన ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టి ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయడం జరుగుతుందని వారికి సూచించారు,ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని అందులో భాగంగానే కొత్తపేట లో . మూడు కోట్ల, 25 లక్షల వ్యయంతో వసతి గృహం నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్,ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, లు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తమ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధికి సహకరించినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె వీరబ్రహ్మచారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిపిఓ హరిప్రసాద్, ప్రాథమిక సహకార సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజయ్య, అన్ని విభాగాల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.——————————–
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *