పండుగ వాతావరణంలో బ్యాండు, కళాకారుల డబ్బు విన్యాసాల మధ్య పాఠశాలకు పంపిన సందర్భం
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ – ఉమారాణి, దంపతుల ఏకైక గారాలపట్టి భవిష్య పటేల్ ను తమ సొంత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాయిన్ చేసి యావత్ గ్రామానికి జిల్లాకి ఆదర్శంగా నిలిచారు,
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే జిల్లాలో మిషన్ మూడు లో విద్యాశాఖ జిల్లా యంత్రాంగం గ్రామ గ్రామాన ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు,
విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ క్లాసులు అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు పరిశుభ్రమైన తరగతి గదులు డైనింగ్ హాల్ తదితర సౌకర్యాలు కల్పించడం జరిగింది, అందులోనూ రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా 10వ తరగతి పరీక్షల్లో మొదటి స్థానంలో ఉన్నది.
అందుకు ఆకర్షితులై సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తమ కూతురిని జాయిన్ చేసి స్థానిక కుటుంబ బంధ విలువలు తో కూడిన విద్య ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని గమనించిన సత్యనారాయణ దంపతులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ కూతురు భవిష్య పటేల్ ను తమ గ్రామంలోని పాఠశాలలో జాయిన్ చేపించి పాఠశాల అభివృద్ధి కోసం 20 వేల రూపాయల నగదు రూపాయల జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి కి అందజేసి ఆదర్శంగా నిలిచారు,
కొలిశెట్టి సత్యనారాయణ, సాంస్కృతిక సారధి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, పలు సేవ సామాజిక కార్యక్రమాలు లో చురుకుగా పాల్గొని వ్యక్తి గా ఉన్నారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని అచ్చ ప్రశాంత్, ప్రియాంక తమ కూతురు సుభిక్ష, తన తోటి మిత్రుల పిల్లలను కూడా జాయిన్ చేశారు, పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు టీ షర్టులు బహుకరణగా అందజేశారు, వారికి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి బొకేలు అందజేసి పాఠశాలకు ఆహ్వానించారు,
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారం జిల్లాలో బడిబాట కార్యక్రమం గ్రామ గ్రామాన వాడ వాడన నిర్వహించి ప్రతి ఒక్కరి సహకారంతో అందరికీ అవగాహన కల్పించి ప్రభుత్వ బడుల ఆవశ్యకత పై ఆయన వివరించారు కావున జిల్లాలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి మంచి భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలవాలని ఆయన సూచించారు,
బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని సంక్షేమ వసతి గృహాలలో నాణ్యమైన డైట్ మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం కాస్మోటిక్ చార్జీలు పెంచి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం విద్యాశాఖకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షించి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందని ప్రభుత్వ బడుల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధనలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఆయన కోరారు,
ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస్, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పూర్ణచందర్ పరిమళ, మైసా శ్రీనివాస్, ఉప్పలయ్య, లక్ష్మి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.