జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, తో కలిసి వ్యవసాయ, హార్టికల్చర్, సహకార శాఖ, ఫర్టిలైజర్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టికల్చర్ సహకార, సంఘాల బలోపేతం, రైతుల సౌకర్యార్థం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు,
పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ పంట సాగు పై రైతులకు అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలని సూచించారు,
పామ్ ఆయిల్ పంట సాగు ద్వారా రైతులకు అనేక లాభాలు చేకూరుతాయని, ప్రభుత్వం కల్పించిన సబ్సిడీ, రాయితీల వివరాలను తెలియపరచాలన్నారు,
జిల్లాలో 4500 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటివరకు 542 ఎకరాల లక్ష్యం పూర్తి చేసామని మిగిలిన లక్ష్యాలను ఆగస్టు మాసంలోపు నెలవారీగా ప్రత్యేక కార్యచరణ చేపట్టి లక్ష్యాలు చేరుకోవాలని అన్నారు,
ఇప్పటికే క్షేత్రస్థాయిలో తనకి పూర్తయిన 2723 ఎకరాల విస్తీర్ణనాకి ప్రభుత్వం సూచించిన ప్రకారం రాయితీ మినహా సొమ్మును రైతుల నుండి డిడి రూపం సేకరించాలన్నారు,
ప్రస్తుత పంటల విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లాలో
యూరియా 9419.894, డీఏపీ 1299.2, ఏంఓపి 387.66, ఎస్ఎస్పి 830.2, కాంప్లెక్స్ 728264, మెట్రిక్ టన్నులు, నిలువలు సిద్ధంగా ఉన్నాయని రైతులు ఏలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు,
ప్రతి వారం రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు నిర్వహించి స్టాకు రిజిస్టర్లను , ఈ పాస్ మిషన్లు సరిచూసుకోవాలన్నారు,
ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని చూసుకోవాలన్నారు,
ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల ఆధార్ ఈకేవైసి, అనుసంధానంతో ఫార్మర్ రిజిస్ట్రి పూర్తి చేయాలన్నారు,
రైతుల సౌకర్యార్థం జిల్లాలో సహకార శాఖ ద్వారా (35) ఎరువుల దుకాణాల పాయింట్లు ప్రారంభించి సిద్ధంగా ఉంచామని, రైతుల అవసరాల కు అనుగుణంగా సరిపడా ఎరువులు నిలువలు గోడౌన్సులలో సిద్ధంగా ఉంచడం జరిగిందని అన్నారు,
నానో యూరియా పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు,
(రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు)
అనే కార్యక్రమం ద్వారా ప్రతి అంశంలో వారికి అవగాహన కల్పించి ప్రచారం చేయాలన్నారు,
ఆయిల్ పామ్ విస్తరణకు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ ఆయిల్ ఫెడ్ సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు అందరూ పరస్పర సహకారంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు,
అంతరం ఉద్యాన దర్శని అనే బుక్కులు ఆవిష్కరించారు,
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియన్న, ఎడిఎలు శ్రీనివాస్ రావు, మురళీ, విజయ్ చంద్ర, అన్ని మండలాల ఏఓలు, ఏఈఓలు, తదితరులు