ఎవ్వరైనా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలకు పాల్పడితే సహించేది లేదు

మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు

కాంగ్రెస్ ప్రభుత్వం అబివృద్ధి,సంక్షేమం తో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ….”

తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పూర్తి భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు
పేద ప్రజలకు ఆరోగ్య అవసరాల రిత్య ఆరోగ్యశ్రీ 10లక్షల వరకు పెంచిన గొప్ప కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసి, రాష్ట్ర రైతులకు పెద్ద ఊరటను అందించిన ఘనత ఇందిరమ్మ ప్రజాప్రభుత్వానిదే అన్నారు.
దేశ చరిత్రలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.

రైతుభరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాంటి పరిమితులు, షరతులు విధించకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది అని అన్నారు.
ఎకరాకు ₹12,000 రైతు భరోసా 1.49 కోట్ల ఎకరాలకు నిధుల విడుదల చేయడంతో రైతుల కళ్ళలో ఆనంధోత్సాహం కలుగుతుంది అని,రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని,రైతులకు ఉచిత కరెంట్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,సబ్సిడీ గ్యాస్ & సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం మున్సిపాలిటీ, మహబూబాబాద్ మున్సిపాలిటీకి 150 కోట్ల రూపాయల తో చేపట్టనున్న పలు అబివృద్ధి పనులకు భూమి పూజ మరియు శంకుస్థాపనలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు,రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి చేతులు మీదుగా ఈ కార్యక్రమము నిర్వహించబడుతుంది కావున అధిక సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయగలరు అని అన్నారు

మహబూబాబాద్ నియోజకవర్గాన్ని గతంలో కంటే మెరుగైన అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు నామీద చేసే దుష్ప్రచారాలు నాయకులు కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు..

అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా దగ్గరికి నేరుగా రాకున్నా నేను మీకు ఇబ్బందులు కలగొద్దని ఒక ఉద్దేశంతో డయల్ యువర్ ఎమ్మెల్యే 8328473007 నెంబర్ పెట్టాను మీరు ఫోన్ కాల్ చేసి మీ సమస్య తెలియజేస్తే త్వరితన సమస్య పూర్తి చేసే విధంగా కృషి చేస్తారన్నారు దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క సేవలను సద్వినియోగపరుచుకొని ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు కోరారు…

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీల్, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ మండల అధ్యక్షులు, మిటకంటి రాంరెడ్డి,మాజీ కౌన్సిలర్ పోతురాజు రాజు, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్, పట్టణ నాయకులు రామరాజు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు , మండల నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *