సిపిఐ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా అజయ్ సారధి రెడ్డి

మహబూబాబాద్ పట్టణానికి చెందిన బి అజయ్ సారధి రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చిన్నతనం నుండి అమరజీ ధర్మన్న స్ఫూర్తితో కుటుంబ సోదరుల ప్రేరణతో అజయ్ సారధి రెడ్డి 1993 లో సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ 1995 సంవత్సరంలో ఏఐఎస్ఎఫ్ మహబూబాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది నాటి నుంచే నేటి వరకు ఎన్నో ఆందోళనలు నిర్వహించారు ముఖ్యంగా అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యారంగ హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు అఖిల భారత విద్యార్థి సమైక్య మహబూబాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఈ డివిజన్ ప్రాంతంలో హాస్టల్ విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీట్ల కోసం స్కాలర్షిప్ల కోసం సౌకర్యాలు కోసం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ గ్రూపుల రావడంలో తనదైన శైలిలో కన్వీనర్ గా ఉండి హైదరాబాద్ వెళ్లి ఉద్యమించి లాఠీ దెబ్బలు తిని మరి సైన్స్ గ్రూపుల కోసం రావడంలో కీలకపాత్ర పోషించారు మహబూబాద్ మహిళా జూనియర్ కళాశాలలో ఫర్నిచర్ కోసం ఎన్నో ఆందోళనలు నిర్వహించి ఫర్నిచర్ సాధించడంలో కీలక పాత్ర వహించారు మహబూబాబాద్ శాఖ గ్రంథాలయం జిల్లా గ్రంధాలయ సంస్థ ఏర్పడే వరకు సుమారు 20 సంవత్సరాల పాటు శాఖ గ్రంధాలయ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు గ్రంథాలయానికి నగరం నడిబొడ్డున విలువైన స్థలం లో నిర్మాణం ఏ విధంగా నిధులను సమీకరించి గ్రంధాలయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది శాఖ గ్రంధాలయ ఏర్పాటయి 50 ఏళ్లు అయిన సందర్భంగా జరిగిన రజతోత్స వేడుకలు మరియు ప్రతి ఏటా నిర్వహించే జాతీయ గ్రంథాల ఉత్సవాలను గ్రంధాల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడడం జరిగింది అనేకమంది క్రికెట్ క్రీడాకారులను అదేవిధంగా ఇతర క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ పట్టణ కార్యదర్శిగా ఎన్నికై ఈ ప్రాంతంలో వందలాది మంది ఎస్టీ, ఎస్సీ మైనార్టీ ఓసి నిరుపేద ప్రజలకు సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి భూమిలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేలా పనులు కాలనీలో ఏర్పడటం లో ముఖ్య ప్రధాన భూమిక పోషించడం జరిగింది అదేవిధంగా 2007 సంవత్సర కాలంలో అరులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంద్రమ్మ బిల్లు వచ్చేందుకు తీవ్రమైన పోరాటాలను సిపిఐ ఆధ్వర్యంలో కొనసాగించడం జరిగింది సుమారు ఆరు నెలల పాటు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది . అదేవిధంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏఐటియుసి లో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆఫీస్ బేరర్ గా రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ గా పని చేస్తూ ఈ ప్రాంతంలో కార్మికుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాడు ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసం చిరు వ్యాపారుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది గాంధీ పార్క్ వద్ద వెండింగ్ జోన్ నిర్మాణం కోసం మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు అయ్యే విధంగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో వీధి వ్యాపారులను స్థానిక పోలీసులు మున్సిపల్ ఇబ్బందులు పెడుతుంటే వారికి అండగా నిలిచి పోరాడడం జరిగింది తెలంగాణ ఉద్యమం మహబూబాబాద్ జిల్లా సాధన ఉద్యమం స్థానిక సమస్యలు కార్మిక కర్షక ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం విధితమే అనంతరం కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అటు ప్రజల కోసం ఇటు కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంలోనే మహబూబాబాద్ మున్సిపాలిటీ ఏర్పడగానే తొలి మున్సిపల్ 2014 ఎన్నికలలో మహబూబాబాద్ మున్సిపాలిటీ లో నాడు 23వ వార్డు కౌన్సిలర్ గా నిలబడి మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పరిధిలో అత్యధిక మెజార్టీతో టౌన్ టాప్ రికార్డు సాధించడం జరిగింది సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికై నాటినుండి 2020 వరకు అనేక ప్రజల కోసం మున్సిపాలిటీలో పోరాడి పట్టణ ప్రజల కోసం నిధులు రాబట్టడంలో సఫలమై అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది నాడు 23వ వార్డులో నూటికి మెజార్టీ పనులు పూర్తి చేసి నాటి 23వ వార్డు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నాడు అనంతరం 2020లో జరిగిన జరిగిన ఎన్నికల్లో రెండవసారి రికార్డు మెజార్టీతో గెలుపొంది మరోసారి సిపిఐ మున్సిపల్ ఫోర్ లీడర్ గా రెండోసారి ఎన్నికై 22వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇంటి నల్లాలు లేని వారికి నల్లాలు ఇప్పించడం ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లాలు అందించడం వార్డులో సీసీ డ్రైనేజీలు సిసి రోడ్లు ఏర్పాటు చేపించడం జరిగింది ప్రభుత్వ పథకాలు అందించడంలో వార్డు ప్రజలకి అందించి ఆదర్శవార్డుగా 22వ వార్డును తీర్చిదిద్దడం జరిగింది . ఈ సందర్భంగా వందకు 90 శాతం 22వ వార్డులో పూర్తి పనులు చేపించడం జరిగింది . ముఖ్యంగా 10 ఏళ్ల పాటు రాక్షస పాలన సాగించిన టిఆర్ఎస్ పార్టీపై యుద్ధం కొనసాగించి మొన్న జరిగిన ఎన్నికల్లో మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఓడించడంలో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులో భాగంగా భుజాన వేసుకొని పనిచేసి గెలుపులో కీలక పాత్ర వహించడం జరిగింది . అదేవిధంగా ఈ ప్రాంతంలో చారిత్రాత్మక విజయాలు సాధించి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి బిజిలి బంద్ రైలు రోకో ఎమ్మెల్యే ఎంపీ ఆఫీస్ కార్యాలయాల ముట్టడి ఎన్నో చేసి కేసుల పాలవడం జరిగింది తెలంగాణ మలిదశ ఉద్యమకారుడుగా మూడు దశాల తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటను రెండు లక్షల రూపాయలతో సొంత ఖర్చులతో ప్రజలకు అందించడం జరిగింది నాడు రాష్ట్ర మంత్రి ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ ఉద్యమ కేసులు భూ పోరాట కేసులు ఆర్టీసీ ఉద్యమ కేసులు ఇతర ప్రజా ఉద్యమాల కేసులతోపాటు అనేక కేసులు పెట్టిన ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు

ఈ సందర్భంగా అజ్జన్న చేసిన పోరాటాలకు మానుకోట ప్రజలందరూ ప్రేమతో మానుకోట ప్రజాయుద్ధనౌక అని పిలవడం జరిగింది

ముఖ్యంగా పట్టణ నడిబొడ్డున ఉన్న మహబూబాబాద్ క్లబ్ ప్రభుత్వ క్లబ్ ను ప్రైవేట్ ఓసి క్లబ్ గా చలామణి చేస్తూ కొంతమంది నాటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఒకరిద్దరు అధికారులు తుమ్మక్కై అక్రమంగా ఆక్రమిస్తుంటే దశలవారీగా ఉద్యమం నిర్వహించి కాపాడడం జరిగింది ఓసి క్లబ్ పూర్వాపురాలను సాక్షాదారులతో సహా బహిర్గతం చేసి ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ స్వాధీనానికై స్వాధీన ఉద్యమం జరుగుతున్నది

గ్రీన్ ల్యాండ్ లు అన్యాక్రాంతం కాకుండా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది 22వ వార్డులో ఒక పార్టీ చెందిన నాయకుడికి నిబంధనలు వ్యతిరేకంగా అక్రమంగా పూర్వ గ్రామపంచాయతీ పాలకమండలి కేటాయించగా దాన్ని ఆసరా చేసుకుని అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నిస్తుంటే దాన్ని కాపాడి త్రివర్ణ పార్కుగా ఏర్పాటు చేయడం జరిగింది కొండపల్లి గోపాల్ రావు కాలనీలో మరొక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది అర్హులందరికీ పెన్షన్లు వచ్చేలాగా ఆందోళనలు చేపట్టడం జరిగింది మల్యాల హెచ్ ఆర్ ఎస్ కె వి కె కార్మికుల టైం స్కేల్ కొరకు అదేవిధంగా అమాలి భవనిర్మాణ అంగన్వాడి ఆశ ఆటో తదితర రంగాల కార్మిక హక్కుల కోసం ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో ముందు వరుసలో ఉండటం జరిగింది

ఈ సందర్భంగా తన ఎన్నికకు కృషిచేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారికి రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు గారికి, జిల్లా కార్యదర్శి విజయ సారధి గారికి బి అజయ్ సారధి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా వెన్నంటి ఉన్న పార్టీ కార్యకర్తలు శ్రేణులు నాయకులు సానుభూతిపరులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా ఇంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో తోడ్పాటు అందించిందని అన్నారు అజ్జన్న ఎన్నిక పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *