ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయంఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 200 (రెండు) వందల ఎకరాలలో అన్ని మండలాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళాను నిర్వహించడం అయినది. ఆయిల్ పామ్ సాగు లాభాలు ఈ కింది విధంగా తెలియజేస్తూ ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళాను పండగ వాతావరణంలో నిర్వహించనైనది.
ఆయిల్ పామ్ సాగు ఎందుకు:
 ఆయిల్ పామ్ వలన ఎకరానికి నూనె రూపంలో రెండు వేల (2000) కిలోలు దిగుబడి వస్తుంది.
 సంప్రదాయ నూనె గింజల పంటల ద్వారా ఎకరానికి 250 కిలోల నూనె రూపంలో దిగుబడి వస్తుంది.
 ప్రతి మనిషి రోజుకి ఆహారంలో వంట నూనెను 25 గ్రాములు ఉపయోగిస్తారు. అలా సాలీనా ఒక మనిషికి10 నుండి 12 కేజీల వంటనూనె అవసరం.
 దేశీయంగా ఉత్పత్తి డిమాండుకు తగ్గట్టు లేదు కనుక, విదేశాల నుంచి వంట నూనెను ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసి ప్రతి ఏటా దిగుమతి చేసుకుంటుంది.
 కనుక వంట నూనెల ఉత్పత్తి పెంచే క్రమంలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం చేపట్టి పలు రాయితీలను ఎకరానికి మొక్కలపై, బిందు సేద్యంపై, అంతర పంటల సాగుపై, యాజమాన్యానికి రూ. 50,000/- రూపాయలు రాయితీ ప్రోత్సాహాలు అందిస్తుంది.
వరి మొదలైన పంటల వలన ఇబ్బందులు ఆయిల్ పామ్ పంట వలన లాభాలు
 అకాల వర్షాలు, గాలులు, వడగళ్లు వలన వరి పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది.
 మార్కెట్ లో వరి ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నవి.
 వరి, పత్తి, మిరప పంటల సాగుకు విత్తిన దగ్గర నుండి కూలీల ఖర్చు ఎక్కవ.
 అలాగే బస్తాల బస్తాలు రసాయన ఎరువులు, కలుపు మందులు మరియు పురుగు మందులు ఎక్కువగా వాడతారు.  ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గును.
 ఆయిల్ పామ్ పంటకు అకాల వర్షాలు, గాలులు, వడగళ్లు వలన ఎలాంటి నష్టం జరగదు.
 ఈ పంటకు చీడపీడల బెడద చాలతక్కువ. కోతులు, కుక్కలు మరియు దొంగల బెడద లేదు.
 రవాణా, మార్కెట్, ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు గిట్టుబాటు ధర కలిగిన పంట.
 ఆయిల్ పామ్ తోటలను 5 ఎకరాలకు భార్య, భర్తలు కలిసి చూసుకోవచ్చు. కూలీలు అవసరం లేదు. పురుగు మందులు, ఎరువులు వాడకం చాలా తక్కువ. తద్వారా మేలైన వాతావరణం, కాలుష్య రహిత మంచి గాలి, నీరు, భూసారం, సేంద్రియ పదార్థం మొదలైనవి పెరుగును.

గౌరవ శాసన సభ్యులు ఇల్లందు శ్రీ కోరం కనకయ్య గారు, శ్రీ లెనిన్ వత్సల్ టొప్పో, I.A.S., అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గారు మహబూబాబాద్ జిల్లా వారి తో పాటు జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి ఇంచార్జ్ ఎ. శ్రీనివాస్, సహాయ వ్యవసాయ సంచాలకులు వి. విజయ్ చందర్, జిల్లా ఆయిల్ ఫెడ్ ఇంచార్జ్ సి. హెచ్. రాములు, అన్ని మండలాల గౌరవ ప్రజా ప్రతినిధులు, గౌరవ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు తో పాటు అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దారులు, ఐకేపీ సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, గ్రామీణ ఉపాధి హామీ APOs, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారులు, బిందు సేద్య ప్రతినిధులు మరియు అభ్యుదయ ఆయిల్ పామ్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
బోర్ల క్రింద ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, మల్బరీ, పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేయాలి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *