విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ ఎస్ నాయకుడు డిఎస్ రవిచంద్ర పుట్టిన రోజు సందర్భంగా నర్సింహులపేట బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి,తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్,మాజీ వార్డు సభ్యుడు ఎండి మదార్ తదితరులు పాల్గొన్నారు.