గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో రెవిన్యూ మరియు పోలీసు అధికారులతో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే ప్రధాన ఏజెండాగా సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లో ఉన్న ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరు పరచాలని, పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్షులను సరైన సమయంలో హాజరు పరచాలని, విచారణ అధికారులు తమ తమ విచారణలను త్వరగా ముగించి కోర్టుకు సహకరించాలని తెలియ జేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణ తేజ్, తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి దీరజ్ కుమార్, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతిరావు, తొర్రూరు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతి కుమార్, కృష్ణకిషోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.