స్థానిక ప్రగతి హై స్కూల్ 2001-2002 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనము IMA బిల్డింగ్ యందు శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు జానకి రాములు, సురేషు, హిమాముద్దీన్, గోపి, మరియు పద్మ పూర్వ ఉపాధ్యాయులు వివిధ రంగాలలో స్థిరపడిన 30 మంది విద్యార్థులు పాల్గొని
వారి విద్యార్థి దశలో జరిగిన మధుర జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో గుర్తు చేసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడము ఆనందం కలుగుతుందని విద్యార్థులు కొనియాడారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరినొకరు చూసుకుని వారి చిన్ననాటి పేర్లు పెట్టి పిలుచుకుంటూ మనసు నిండా అంతులేని ఆనందాన్ని నింపుకున్నారు. వారి సంతోషాలకు అవధులు లేవు. వారి మధుర స్మృతులు వారి కంటినుంచి ఆనంద భాష్పాల రూపంలో దర్శనమిచ్చాయి. వారికి విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు వివిధ రంగాలలో స్థిరపడిన శిష్యులను చూసి వారు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించి
కన్నవారి వారి కలలు నెరవేర్చాలని కొనియాడారు.
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
12
Jul