జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవి రాథోడ్ తొర్రూర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుప్రీత, గణేశ్ డయాగ్నొస్టిక్ సెంటర్, నిర్మల హాస్పిటల్, పద్మావతి హాస్పిటల్ మొదలగు ఆసుపత్రులను తనిఖీ చేసి రికార్డు ల నిర్వహణ సరిగా లేని ఆసుపత్రుల పైన అసహనం వ్యక్తం చేస్తూ అట్టి ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తామని ఆగ్రహం వెలిబుచ్చారు.
ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు అత్యావసర సేవలకి సంబంధించిన ఫోన్ నంబర్స్ ని, వారు అంధించే సేవలకు తీసుకునే రుసుములకు సంబంధించిన దరల పట్టికను, ఆసుపత్రులలో పనిచేయు డాక్టర్ ల వివరాలు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పిసిపిఎన్‌డిటి సర్టిఫికేట్ లను కూడా అందరికీ కనిపించే విదంగా ప్రదర్శించాలని, అలాగే ఫైర్ కు సంబంధించిన పరికరాలను అమర్చుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో సూచికల బోర్డు లను ఏర్పాటు చేయాలని, పనిచేయు సిబ్బంది యొక్క వివరాలను, వారి యొక్క అర్హత సర్టిఫికెట్ ల ను ఆసుపత్రులలో వుంచాలని, ఒకవేళ సిబ్బంధిని గాని డాక్టర్ లను కానీ మార్చినట్లయితే, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయమునకు అట్టి వివరములు ముందు గానే తెలియ పరచాలని, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇచ్చిన సర్టిఫికెట్స్ ను రెన్యూవల్ చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. విదేశాలలో ఎంబిబిఎస్ చదువుకొని వచ్చిన వారు భారత ప్రభుత్వం వారు నిర్వహించే అర్హత పరీక్ష ఉత్తీర్ణత చెందాలని, అంతేకాకుండా వారి డిగ్రీలు ఎంబిబిఎస్ కు మాత్రమే సమానమని ఎం.డి అని రాసుకోకూడధని ఒకవేళ ఎవరైనా అలా రాసి ప్రజలను తప్పుధోవ పట్టిస్తే వారిపైన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరిపెడ బంగ్లాలోని మంద వెంకన్న నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడ రోగులకు అందిస్తున్న చికిత్స విదానాన్ని పరిశీలించగా ఎలాంటి అర్హతలు లేకుండా రోగుల కు స్టెరాయిడ్ ఇంజక్షన్లు, ఆంటీ బయాటికులు, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ చికిత్స చేస్తుండగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అసహనం వ్యక్తం చేస్తూ మంద వెంకన్న నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధమ చికిత్స కేంద్ర నిర్వాహకులు కేవలము ప్రథమ చికిత్స ను మాత్రమే చేయాలని, యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇవ్వరాదని, ఐ వి ఫ్లూయిడ్స్ పెట్టరాదని, పేరు ముందు డాక్టర్ అని రాసుకో రాదని, అర్హత కి మించి వైద్యం చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు.