ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రి పొన్నం ఫోకస్

జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి తో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ పార్లమెంట్ ఇంచార్జి ఉపాధ్యక్షులు ,జనరల్ సెక్రెటరీలు ,పార్టీ జిల్లా అబ్జర్వర్లతో సమావేశం..

ఎఐసిసి ఆదేశాల మేరకు ఈనెల 15 వ తేదీ లోపు జిల్లా కార్యవర్గం పూర్తి చేసేలా కసరత్తు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అభివృద్ధి సంస్థాగత నిర్మాణం పై పీసీసీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేతలు, పీసీసీ నియమించిన పార్లమెంట్ ఇంచార్జి లు ,జిల్లా పార్టీ అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈనెల 15 లోపు గ్రామ ,మండల, జిల్లా నూతన కార్యవర్గాలను పూర్తి చేసేలా కసరత్తు నిర్వహించారు. ఇప్పటికే గ్రామ , మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గానికి సంబంధించి గతంలో అప్లికేషన్ లు తీసుకున్న ఆశావహుల జాబితా పై స్థానిక ఎమ్మెల్యేలు ,పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అబ్జర్వర్ల సమక్షంలో వారికి పీసీసీ జిల్లా ఇంచార్జి ఇంటర్వ్యూ లు నిర్వహించి తుది జాబితా ఫైనల్ చేయనున్నారు.ఒక్కో మండలానికి ముగ్గురు పేర్లు అదే విధంగా జిల్లా ఉపాధ్యక్షులు పేరు ఇతర కార్యవర్గ పేర్లు ప్రకటించనున్నారు. ఎఐసిసి ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గంలో యువత కు ప్రాధాన్యత ఇవ్వడంతో మహిళలకు పెద్ద పీట వేయాలని సూచించారు. సామాజిక సమీకరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నూతన కార్యవర్గంలో అవకాశం కల్పించాలని సూచించారు.పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న మూడు డిసిసి ల పరిధిలో మెదక్ , సంగారెడ్డి ,సిద్దిపేట జిల్లాలో ఈనెల 11 తర్వాత పర్యటిస్తానని పీసీసీ జిల్లా ఇంచార్జి పొన్నం ప్రభాకర్ తెలిపారు… రేపు మెదక్ జిల్లా ముఖ్య నేతలు ,10 నియోజకవర్గాల ఇంచార్జిలు , అబ్జర్వర్లతో మరోసారి సమావేశం కానున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.సమావేశంలో పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ , సిద్దిపేట ,సంగారెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి,నిర్మలా జగ్గారెడ్డి, ఆంజనేయులు గౌడ్,పార్టీ అబ్జర్వర్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ,మెట్టు సాయికుమార్ , చనగాని దయాకర్ ,మెదక్ , జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి లు పీసీసీ ఉపాధ్యక్షులు నవాబ్ ముజాయిద్ అలంఖాన్ ,బండి రమేష్ , జనరల్ సెక్రెటరీ లు జగదీశ్వర్ గౌడ్ , దార సింగ్ ,ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *