మండల కాంగ్రెస్
కేసముద్రం, జులై 21
నిరుపేదలకు ఇండ్ల మంజూరి ఇందిరమ్మ రాజ్యమైన రేవంత్ సర్కార్ తోనే సాధ్యం అయ్యిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆదేశాలమేరకు లబ్ధిదారులతో, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డిలు పాల్గోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నొ ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఇంటి కల సాకారం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పోలేపాక నాగరాజు, తరాల సుధాకర్, బధ్య నాయక్, జల్లంపల్లి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రఫీ ఖాన్, ఎండీ రషీద్ ఖాన్, ఎండీ తజోద్దీన్, ఎండీ నవాజ్ అహ్మద్, బన్నిశెట్టీ వెంకటేష్, చెడుపెల్లి ఎలేందర్, సుందర్ వెంకన్న, శబ్బు, ఆగే చిన్న వెంకన్న,దాస్యం లక్ష్మణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.