నేడు మహాకవి దాశరథి శతజయంతి వేడుకలు..
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో జన్మించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య…
మహబూబాబాద్ జిల్లాలో కనిపించని దాశరథి శతజయంతి ఉత్సవాల సందడి.., ఆ..మహాకవి పుట్టిన ఊరు “చిన్నగూడూరు”, పెరిగిన ఊరు “గార్ల” రెండు మహబూబాబాద్ జిల్లాలోనే ఉన్నప్పటికీ శతజయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏమి ఏర్పాటు చేయని అధికారయంత్రాంగం., రాష్ట్రప్రభుత్వం…!!. అంతటి మహాకవి మన మానుకోట మట్టిబిడ్డ అని భవిష్యత్తు తరాలకు చాటిచెప్పేందుకైనా, తీరిక, సమయం లేకున్నా కనీసం మూడురోజులపాటైన ప్రత్యేక కార్యక్రమాలు శతజయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించి ఉంటే బాగుండేదని పలువురి అభిప్రాయం. ఈరోజు పోటోకు ఓ...దండేసి దండం పెట్టడం కన్నా…!! దాశరథి కృష్ణమాచార్య సాహిత్యాన్ని ప్రజల్లోకి, ప్రధానంగా యువతలోకి, విద్యార్థులలోకి తీసుకెళ్ళే కార్యక్రమాలు నిర్వహించడం స్పూర్తిదాయకంగా ఉండేదని, జిల్లాయంత్రాంగం, ప్రభుత్వం నిర్వహిస్తే గౌరవంగా ఉండేదంటున్న ప్రజలు. ఆ..చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో…!! ఆ..నల్లని ఆకాశంలో కానరాని బాస్కరులెందరో అంటూ ఆనాడే నర్మగర్భంగా ప్రశ్నించిన దాశరథి పాట ఇప్పటికీ.., ఎప్పటికీ సజీవం. మన జిల్లాలో పుట్టిన మహానుభావులు, మహాకవి దాశరథి శతజయంతిని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఓ..పండుగలా చేసి ఉంటే బాగుండేదనే బాద వేదిస్తున్న.., మహానీయ మన్నించు…, మీ..శతజయంతి వేళ మమ్మల్ని చైతన్యవంతులుగా మారండని ఆశీర్వదించు…