కంబాలపల్లి నుండి వయా కొంగరిగిద్ద మీదుగా ఊట్ల వరకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం..
గ్రామ గ్రామాన ఎమ్మెల్యే మురళీ నాయక్ కు జన నీరాజనం…బస్సు లోనే గ్రామగ్రామన పర్యటన
మహబూబాబాద్
ఇప్పటి వరకు బస్సు తిరగని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి ప్రజల గుండెల్లో చీర స్థాయిగా నిలిచిన.. ఎమ్మెల్యే మురళీ నాయక్..
నేడు కంబాలపల్లి నుండి ఊట్ల గ్రామానికి వయా కొంగరిగిద్ద మీదుగా ఇప్పటికీ వరకు బస్సు సౌకర్యం లేదు.గత 10 ఏండ్లు గా ఇక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.ఎన్నికల ముందు ఎమ్మెల్యే మురళి నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి,ఆ బస్సులోనే మీ గ్రామాలకు వస్తానని హామీ ఇచ్చాడు.ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నూతన బస్సు సౌకర్యం కల్పించి,ఇదే బస్సు లో ఆయా గ్రామాల్లో తిరిగాడు.
మాట నిలిబెట్టుకున్నాడని మహిళలు మంగళహారతులు పట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో DM శివ ప్రసాద్, జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
::::::పత్రికా ప్రకటన ::::::
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లో భాగంగా టీ జి ఎస్ ఆర్ టి సి సంస్థ ద్వారా రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికులను చేరవేసిన విజయోత్సవ సందర్భంగా మహబూబాబాద్ డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ గారి అధ్యక్షతన గౌరవ మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ మురళి నాయక్ గారి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. మరియు అందులో భాగంగా నూతనంగా మూడు సర్వీసులను ప్రారంభించడం జరిగింది.
అందులో 1. మహబూబాబాద్ నుండి నర్సంపేట మీదుగా ఏటూరునాగారం ఎక్స్ప్రెస్ సర్వీస్,
- మహబూబాబాద్ నుండి బయ్యారం మీదుగా రామ గుండాల నుండి ఇల్లందుకు ఆర్డినరీ సర్వీస్,
- మహబూబాబాద్ నుండి నక్కబండ ఊట్ల -గూడూర్- నర్సంపేట్ బస్సు సర్వీస్ లను గౌరవ మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ మురళి నాయక్ గారి చేతుల మీదుగా ప్రారంభించినారు ఇట్టి కార్యక్రమంలో మహబూబాబాద్ డిపో పరిధిలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు మహాలక్ష్మి పథకం మహిళల అభ్యున్నతి అను అంశం మీద నిర్వహించడం జరిగింది అందులో విజేతలు అయిన ఏడుగురు అమ్మాయిలకు బహుమతులు ఎమ్మెల్యే గారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది మరియు మన మహబూబాబాద్ డిపో నుండి కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ ప్యాసింజర్లు అయినటువంటి ఐదుగురు మహిళా మణులను ఎమ్మెల్యే గారిచే సన్మానించి వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది మరియు డిపోలో ఉద్యోగం చేయుచున్న మహిళా కండక్టర్లకు కూడా ఎమ్మెల్యే గారి చేతులమీదుగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీ యం శివప్రసాద్ గారు, టి ఐ టు శ్రీనివాస్, ఎం. ఎఫ్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు