తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు కళాశాల , తొర్రూరు లో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఫాతిమా బేగం , టి.జి.టి.ఉర్దూ , ఏప్రిల్ నెలలో అకస్మాత్తుగా మరణించగా టిమిరీస్ సంస్థలో పనిచేస్తున్న ఉర్దూ విభాగపు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో పాటు ఇతరులు చేసిన సహాయముతో అక్షరాల 2 లక్షల రూపాయలను పోగు చేసి నేడు దివంగత ఉపాధ్యాయురాలు కూతురు కుమారి అక్సా థంకీన్ పేరుతో ఇండియన్ బ్యాంక్ మహబుబాబాద్ యందు ఫిక్స్ డిపాజిట్ చేయించినారు. అట్టి పత్రాలను మహబూబాబాద్ మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్.జి. శ్రీనివాసరావు చేతులు మీదుగా అందించినారు. ఇట్టి మహోన్నత కార్యక్రమాన్ని పూర్తి చేయుటకు సహకరించిన తొర్రూరు ప్రిన్సిపల్ వనజ గారితో పాటు ఇతరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖుర్షీద్ , అస్మా, సాదత్ సిద్ధిఖా , రేణుక, ఉమ్మి హాని , మహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ స్కూల్ ఉపాధ్యాయురాలు కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం
28
Jul