శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా మండలంలోని బీచ్ రాజు పల్లి గ్రామంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు స్వ గృహంలో వరలక్ష్మి అమ్మవారి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం సందర్బంగా బీచు రాజ్ పల్లి గ్రామంలో వరలక్ష్మి అమ్మ వారి పూజలు గుడిపూడి నవీన్ రావ్ మంజుల దంపతులు ఆధ్వర్యంలో మహాలక్ష్మి రావే మా మేలుకోవే వరలక్ష్మీ రావమ్మ మమేలుకోవమ్మ అంటూ భక్తిశ్రద్ధలతో భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మన హిందూ సంప్రదాయంలో చిన్నప్పటినుండి ఎంతో భక్తితో, అంకితభావంతో మహిళలందరూ జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ వరలక్ష్మి వ్రతం. సిరుల లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలను ఆశిస్తూ జరిగే ఈ వ్రతం ప్రతి స్త్రీ జీవితంలో ఓ గొప్ప అనుభూతిగా నిలుస్తుంది.
ఈ శుభదినాన మీ అందరిలోనూ సిరులు, సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు విరజిల్లాలని అన్నారు. వేద పండితులు చిట్టా శ్రీకాంత్ శర్మ వేదమంత్రాలు వరలక్ష్మి వ్రత పూజ మంత్రాలతో వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు మత్తయిదులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బీచు రాజ్ పల్లిలో భక్తిశ్రద్ధలతో పల్లిలో వరలక్ష్మీ వ్రతాలు
08
Aug