అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి
వామపక్ష నేతలు సాదుల శ్రీనివాస్ పెరుగు కుమార్ రేశపల్లి నవీన్ డిమాండ్
నాడు నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం సలార్ తండా గిరిజనుల భూములను అక్రమంగా లాక్కుంటుంటే వారికి మద్దతుగా వెళ్లి ఉద్యమిస్తే నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వామపక్ష నేతలపై మరియు గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులో భాగంగా నేడు కోర్టుకు హాజరవడం జరిగింది
ఈ సందర్భంగా వామపక్ష నేతలు సాధుల శ్రీనివాస్ పెరుగు కుమార్ రేషపల్లి నవీన్ లు మాట్లాడుతూ అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నాడు వామపక్ష పార్టీల పోరాటం వల్ల గిరిజనులకు ఎకరాకు 21 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చిందన్నారు టిఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
కోర్టుకు హాజరైన వారిలో ఆంగోత్ శివాజీ,సురేష్, సురేందర్, వీరు, వెంకన్న హాజరైనారు