-తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్
మహబూబాబాద్: జిల్లాలో నిస్థానిక అమరవీరుల స్తూపం వద్దకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం ఉదయం చేరుకుంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సీమ శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి. అమరులైన వారందరికీ తెలంగాణ సాంప్రదాయ ప్రకారం పితృఅమావాస్య రోజు బియ్యం ఇవ్వడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దేశ గాని కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీను మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమాలతో త్యాగాలతో, పోరాటాలతో బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల సంక్షేమ ఆత్మగౌరవం గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని 8 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేశామన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఉద్యమకారుల ఆత్మగౌరవం లేకుండా అవకాశాలు లేకుండా కనీసం తమ కుటుంబాలు గడపడం కూడా కష్టంగా ఉందన్నారు. అటువంటి ఉద్యమకారులని ఆదుకోవాలని ఝార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా ఇక్కడి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను
250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం హామీలను వెంటనే అమలు చేసారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి 10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలి.
తెలంగాణ కళాకారుల సంక్షేమ కూడా ఏర్పాటు చేయాలి.
తెలంగాణ ఉద్యమకారులకి ఉచిత విద్య, బస్సు ట్రైన్ ఆరోగ్య కార్డులు సంక్షేమ పథకాల్లో 20% కోటా కేటాయించాలి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులని గౌరవించుకోవాలి.
సామాజిక, ప్రజాస్వామ్య సంపూర్ణ తెలంగాణ కోసం కృషిచేయాలి.
ఆమరణవరతు కుటుంబాలన్నింటిని (1200 మంది) ప్రభుత్వం ఆదుకోవాలి.
రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇవ్వాలి.
తెలంగాణలోని పరిశ్రమలన్నిటిలో తెలంగాణ ప్రాంతవాసులకి 90% ఉద్యోగ అవకాశాలు కేటాయించాలి.
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకి ఉద్యోగాలలో 20% కోటా కేటాయించాలి.
అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకి ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయించాలి.
ఈ లక్ష్యల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుందని ఉద్యమకారులందరు ఐక్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పనిచేద్దాం వారు పిలుపునిచ్చారు. ఈనెల 26.10.2025 రోజున హైదరాబాద్లోని ఇందిరపార్కు వద్ద జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల హామీలు అమలు సదస్సు కి తెలంగాణ ఉద్యమకారులందరు హాజరై విజయవంతం చేయాల్సింగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శిసురెంధర్ రెడ్డి,జానకి రెడ్డి ,జగన్ నాయక్ ,గుండు.దయానంద్,ఎ.శివకుమార్ నేత ,చంద్రబాను,వీరస్వామి సోమారపు వీరస్వామి ,రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ప్రధానకార్యదర్శ, జిల్లా సలహాదారులు సమ్మెట సమ్మయ్య గౌడ్, మరిపెడ మండల అధ్యక్షులు అలువాల శ్రీనివాస్, బోడపట్ల వెంకన్న, కాజా మియా, గంధసిరి వేణు, వెంకట్ నారాయణ, బింగి రమేష్ యాదవ్, అప్పయ్య, అప్సర్, సలీం, మహబూబ్ ఇతరులు పాల్గొన్నారు.