సిపిఐ మహబూబాద్ మండల కౌన్సిల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి
నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాద్ మండలం అత్యవసర కౌన్సిల్ సమావేశం లింగ్య నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారధి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్థానిక ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామపంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినందున మహబూబాబాద్ మండలంలో ఎనిమిది గ్రామపంచాయతీ మూడు ఎంపీటీసీ మరియు మహబూబాబాద్ మండల జడ్పిటిసి స్థానాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావాలని తెలిపారు,, కాంగ్రెస్తో ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో సయోద్య కుదుర్చుకొని వారి విజయానికి కృషి చేయడం జరిగిందని ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్తో సయోధ్య కుదుర్చుకొని కలిసి పోటీ చేసేందుకు మా వంతుగా సిపిఐ పక్షాన కృషి చేస్తామని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వారి కష్టసుఖాల్లో అండగా ఎప్పటికీ నిలబడే సిపిఐ అభ్యర్థులను ఆదరించాలని అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు,, మహబూబాబాద్ మండలంలో ఎనిమిది గ్రామపంచాయతీ 3 ఎంపీటీసీ ఒక జడ్పిటిసి స్థానంలో పోటీ చేసేందుకు మండల సమావేశంలో తీర్మానం చేసినట్టు రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ సిపిఐ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు
ఈ సమావేశం లో cpi నియోజకవర్గ కార్యదర్శి బి. అజయ్ సారధి రెడ్డి,,కాట్లోజు పాండురంగా ఛారీ తండా సందీప్, బానోత్ లింగ్య నాయక్, కొమ్ము నారాయణ, పెరుగు కుమార్,చింత కుంట్ల వెంకన్న తండా సతీష్, పొలగాని శ్రీను, కౌసల్య, శేఖర్, వినయ్,గురుస్వామి పాల్గొన్నారు
రేపు తేదీ అనగా అక్టోబర్ 1 న సిపిఐ మహబూబాద్ జిల్లా ఎన్నికల అత్యవసర సమావేశం 11 గంటలకు స్థానిక వీరభవన్ సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శిలు జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రజాసంఘాల బాధ్యులు సిపిఐ సీనియర్ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి తెలిపారు