2025 – 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

25-26, ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ కోసం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు,

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు,
ఐకెపి, గిరిజన కార్పొరేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, తదితర సంస్థల ద్వారా సుమారు (237) కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, అందుకోసం జిల్లా స్థాయి దాన్యం కొనుగోళ్ల కేంద్రాల కమిటీ ద్వారా ప్రభుత్వం సూచించిన ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు,
ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయ శాఖ ద్వారా స్వీకరించి కేంద్రాలకు వచ్చే దాన్యం పూర్తి వివరాలు కొనుగోలు రవాణా,తదితర, ప్యాడి క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, మ్యాచ్చర్స్, మిషన్లు, తదితర అంశాలపై క్షేత్రస్థాయి అధికారులందరికీ శిక్షణ తరగతులు నిర్వహించాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు,
కేంద్రాలలో గన్ని సంచులు, అవసరానికి అనుగుణంగా ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు,
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి దాన్యం డబ్బుల ను రైతుల ఖాతాలలో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆన్ని శాఖల సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు,

ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డి.ఎస్.ఓ ప్రేమ్ కుమార్, డిఏఓ విజయనిర్మల, డిఎం సివిల్ సప్లై క్రిష్ణవేణి, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎల్డిఎం, ఆర్టీవో సాయిచరణ్, దేవ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *