విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించం అని BSP రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్ అన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో భాగంగా జిల్లా లోని కొన్ని స్కూల్ సెలెక్ట్ అవ్వగా అందులో సీట్లు వచ్చిన SC ST విద్యార్థులకు ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి ప్రైవేటు పాఠశాలలకు నిధులు విడుదల చేయకపోవడం తో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థులను దసరా తర్వాత పాఠశాలలకు రానీయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన అన్నారు…. ఈ విషయాన్ని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం లోని DTDO కార్యాలయం లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లి తండ్రులు A. లక్ పతి,M కృష్ణ, గోపి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించం: BSP రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్
08
Oct