సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి
బయ్యారం
సిపిఐ పార్టీలో వామపక్ష భావజాలంతో పేదల అభ్యున్నతికి,సమాజ శ్రేయస్సు కు దోహదాపడడానికి,అలాగే కుటుంబానికి సమ న్యాయంతో వ్యవహరించిన మహనీయుడని సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి రెడ్డి అన్నారు. సిపిఐ మండల కార్యదర్శిగా,జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారని అన్నారు.పుసులూరు రంగన్న సంస్మరణ సభ మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో గురువారం కమ్మ ఫంక్షన్ హాలులో సిపిఐ మండల కార్యదర్శి సారిక శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా ఆ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు భాగం హేమంతరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్,ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య, సిపిఎం జిల్లా నాయకులు మండ రాజన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ కుటుంబంలో,సమాజంలో అందరి మన్నలను పొంది సిపిఐ పార్టీ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి అని,ఒకే పార్టీలో ఉంటూ పార్టీని వీడకుండా పలువురికి ఆదర్శంగా పనిచేశారని తెలిపారు.నిత్యం పేద ప్రజల బాగోగుల కోసం తపించే వారని తన జీవితంలో రంగన్న భార్య ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మృతి చెందడం,అది మరిచిపోక ముందే రంగన్నను కోల్పోవడం పార్టీకి,కుటుంబ సభ్యులకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రంగన్న సంస్మరణ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు శ్రీలత, శ్రీలక్ష్మి
అమ్మానాన్న ప్రేమలను ఎన్నటికీ మర్చిపోమని వారి తండ్రి సంస్మరణ సభలో గుర్తు చేసుకొని కన్నీటి పర్వంతమయ్యారు.మా అమ్మా నాన్నలు ఆడపిల్లలమని ఎప్పటికీ దిగులు పడలేదని,మా పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా అల్లుళ్లను కూడా సొంత కొడుకుల వలె ప్రేమించారని, వారి సేవలను గుర్తు చేసుకున్నారు. మా అమ్మానాన్నలు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా,మంచి సంస్కారం ఇచ్చారని వారి లాగా మా అత్త వారి కుటుంబ సభ్యులు ఎంతో తోడ్పాటును ఇచ్చారని,ఈ సందర్భంగా వారి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, సిపిఐ మహిళా సంఘం జిల్లా నాయకురాలు నాదెండ్ల పద్మ, జిల్లా కమిటీ సభ్యులు అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్, ఇల్లందు నియోజకవర్గ సిపిఐ నాయకులు,సిపిఎం మండల కార్యదర్శి నంబూరి మధు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తిరుమల ప్రభాకర్ రెడ్డి,మూల మధుకర్ రెడ్డి, సత్తిరెడ్డి, కళింగ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.