మహబూబాబాద్
రైతు నేస్తం – 2025 పురస్కారానికి మహబూబాబాద్ జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న ఎంపికయ్యరు. రైతులకు సేవ, నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల విస్తరణ, రైతులు పలు మేలైన యాజమాన్య పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానం, రైతుల విజయ గాధలు మొదలైన విషయాలను తెలియజేస్తూ ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూలు, మల్బరీ, మునగ మొదలైన పంటల విస్తరణకు రైతులకు అవగాహన చేస్తూ, 30 (ముప్పై) వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల విస్తరణ చేసినందుకు మరియు ఉద్యాన పంటలు కూడా 10 (పది) వేల ఎకరాల విస్తరణ చేసినందుకు వారి సేవలను గుర్తిస్తూ విస్తరణ విభాగంలో రైతు నేస్తం – 2025 పురస్కారానికి జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్నని ఎంపిక చేశారు. 26 ఆదివారం ఉదయం 11:00 గంటలకు స్వర్ణ భారతి ట్రస్ట్, ముచ్చింతల్, శంషాబాద్, హైదరాబాద్ నందు భారత పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకోనున్నారు.