భారాస జిల్లా అధ్యక్షులు కవిత మాలోత్
మొంథ తుపాను ప్రభావంతో నిన్న రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతు రహదారులు జలమయమయ్యాయి ,పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి, ,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని భారాస జిల్లా అధ్యక్షులు మాలోత కవిత తెలిపారు. అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని ,ప్రజలకు అందుబాటులో ఉండాలని ,విద్యుత్తు శాఖ మున్సిపల్ మరియు పారిశుధ్య కార్మికులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కవిత తెలిపారు.