జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు, ఐక్యమత్యంతో ఏదైనా సాధ్యం అవుతుంది,
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
రన్ ఫర్ యూనిటీ 2కె,25, కార్యక్రమంలో యువతీ, యువకులతో ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు,
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150,వ జయంతి పురస్కరించుకుని మహబూబాబాద్ పోలీస్, ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ, 2కె రన్ ను “జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో,” లు జెండా ఊపి రన్ ప్రారంభించారు,
నెహ్రూ సెంటర్, జనరల్ హాస్పిటల్, ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగిన ఈ రన్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, డీఎస్పీలు, పోలీస్ యంత్రాంగం, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, స్థానిక యువతీ, యువకులు, వాకర్స్, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగి ర్యాలీలో పాల్గొన్న వారితో కలిసి ప్రతిజ్ఞ చేశారు,
అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ గారు పటేల్ చూపిన మార్గంలో యువతి, యువకులు, ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి ప్రయాణిస్తే మెరుగైన సమాజం నిర్మాణం కోసం మరింత కృషి చేసినట్లు అవుతుందని ఆయన ఐడియాలజీ, యూనిటీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలని సూచించారు,
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక మాట్లాడుతూ ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయి పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని మెరుగైన సమాజం కోసం ఆయన చూపిన మార్గాన్ని ఐకమత్యంతో అనుసరించాలని సూచించారు,
జిల్లావ్యాప్తంగా అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు వివిధ కార్యక్రమాల ద్వారా జరుపుకొని వారి యొక్క త్యాగాలను గుర్తుకు చేసుకున్నామని,
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐడియాలజీ ప్రకారం జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఎదుర్కొని సమస్యలను అధిగమించి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని, అందులో భాగంగానే గతంలో వరదలు వచ్చిన సమయంలో యూరియా పంపిణీలో చేసిన కృషి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారి ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో కూడా ఇలా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్పీ తెలిపారు,
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీనివాసరావు, విజయ ప్రతాప్, మోహన్, సిఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, తదితరులు పాల్గొన్నారు.