మహబూబాబాద్ లో బాలల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి
గారు మాట్లాడుతూ విద్యార్థులను సృజనాత్మక రంగం వైపు అడుగులు వేయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా అవసరమని భవిష్యత్తులో విద్యార్థులు సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని పేర్కొనడం జరిగింది అదేవిధంగా మూడు రోజులపాటు నిర్వహించేటువంటి వైజ్ఞానిక పరిషత్ లో భాగంగా జిల్లా పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా దీనిని తిలకించి కొత్త ఆలోచన విధానాలను రూపొందించుకోవాలని పేర్కొనడం జరిగింది.ఇందులో భాగంగా జిల్లా సైన్స్ అధికారి బి అప్పారావు గారు మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఇన్స్పైర్ విభాగంలో
86 ప్రదర్శనలు అదేవిధంగాRSBVP లో 200 ఎగ్జిబిట్లు ప్రదర్శనకు పెట్టడం జరిగింది. మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, గతంలో మన జిల్లా నుంచి జాతీయస్థాయికి ప్రదర్శనలు ఎంపిక కావడం జరిగిందని అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదర్శనలు కూడా జాతీయస్థాయిలో ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దూర ప్రాంత విద్యార్థులకు రెండు రోజులపాటు హాస్టల్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందనే విషయాన్ని పేర్కొనడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి పరీక్షలు విభాగం కార్యదర్శి బాలాజీ గారుఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఎఫ్ ఏ ఓ శంకర్ గారు ఏ సీజీఈ మందుల శ్రీరాములు గారు వివిధ మండలాల meo లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
మహబూబాబాద్ లో ఘనంగా బాలల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
25
Nov