బాలికల రక్షణకు బాసటగా నిలుస్తాం

  • ⁠భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి
  • ⁠షీ టీం ఎస్సై పెండెల సునంద
    మహబూబాబాద్:
    తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళల ఫార్మసీ కాలేజ్, మహబూబాబాద్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం నేషనల్ ఉమెన్ సేఫ్టీ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సు చేపట్టారు.
    కార్యక్రమానికి ముఖ్య పక్తగా మహబూబాబాద్ షీ టీం ఎస్సై పెండెల సునంద హాజరై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సునంద మాట్లాడుతూ..మహిళలు, చిన్నపిల్లలు, బాలికలు, విద్యార్థినిలకు షీ టీం భరోసాగా నిలుస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.
    మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నేషనల్ ఉమెన్స్ సేఫ్టీ డే సందర్భంగా లయన్స్ క్లబ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని, ముఖ్యంగా విద్యార్థినిలు సోషల్ మీడియాతొ జాగ్రత్త గా ఉండాలని తెలిపారు.
    విద్యార్థినిలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. మహిళల మరియు విద్యార్థినుల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం కి సమాచారం అందించాలని సూచించారు మా షీ టీం యొక్క మొబైల్ నెంబర్ 8712656935 కు ఫిర్యాదు చేయవచ్చునని ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
    పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని విద్యార్థినిలు గుర్తించి చదువుపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. మీ కాలేజీ మరియు హాస్టల్ పరిసరాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు.
    భద్రతా పరమైన ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు.
    ఏదైనా సమస్య వచ్చినప్పుడు డయల్ 100 సేవలను వినియోగించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
    సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని , అపరిచిత వ్యక్తుల వద్ద నుండి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దన్నారు.
    సైబర్ నేరాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫిర్యాదు చేయాలని వివరించారు.
    ఈ కార్యక్రమం తదనంతరం మహబూబాబాద్ లైన్స్ క్లబ్ వారు మరియు ఫార్మసీ కాలేజ్ యాజమాన్యం నేషనల్ ఉమెన్స్ డే ని పురస్కరించుకొని షీ టీం ఎస్సై సునంద గారిని శాలువాతో సన్మానించడం జరిగింది.
    ఇంకా కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, మైక్రో డిస్ట్రిక్ట్ బాద్యులు అనుమాల వెంకటేశ్వర్లు, సీనియర్ సభ్యులు పీ.వీ.ప్రసాద్, సాదుల సురేష్ బాబు, మాలె కాశీనాథ్, ప్రభుత్వ మహిళ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. హేమలత గారు మరియు వైస్ ప్రిన్సిపాల్ రోసీ మేడం, అధ్యాపలు కల్పన, అన్నపూర్ణ, సనా, సునీత తదితరులతో పాటు విద్యార్థినులు,
    షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుధాకర్,అరుణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *