మహబూబాబాద్ జిల్లా మరిపెడ :
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బుర్హాన్ పురం, అబ్బాయి పాలెం, పురుషోత్తమాయగూడెం, గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ పురుషోత్తయగూడెం మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి తో కలిసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ధాన్యంలో 17 శాతం తేమ ఉండే విధంగా చూసుకోవాలని, ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గ్రేడ్ ఏ సన్న ధాన్యానికి ప్రభుత్వం 2389 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించిందని, అదనంగా ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ వస్తుందని, సాధారణ రకానికి 2369 రూపాయల మద్దతు ధర లభిస్తుందని అన్నారు. ఏఈఓ నుండి స్లిప్పలు తీసుకొని వచ్చిన రైతుల ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కాంటాలు వేసి త్వరితగతిన రైతుల అకౌంట్లో డబ్బులు పడేవిధంగా చూడాలని నిర్వాహకులు సూచించారు. ఆధార్ కార్డు లింక్ అయి, రన్నింగ్ లో ఉన్న బ్యాంకు ఖాతాలను రైతులు ఇవ్వాలని, ఓటిపి వచ్చే ఫోను రైతులు కలిగి ఉండాలని అన్నారు. అనంతరం పురుషోత్తమాయగూడెంలో మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ను ప్రారంభించి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
మరిపెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్
26
Nov