గిరిజన ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశిరాం నాయక్

మహబూబాబాద్, నవంబర్.26

గిరిజన సంక్షేమ శాఖలోనీ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు మూడవ (స్పెల్ ) దఫాలో ఇస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా, 3వ రోజు జిల్లాలోని స్థానికంగా కంకరబోడ్ హై స్కూల్, ఆశ్రమ బాలుర మరియు బాలికల పాఠశాల మహబూబాబాద్ శిక్షణ శిబిరాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాం నాయక్ సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ వారి ద్వారా కెపాసిటీ బిల్డింగ్ అంశం పైన ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా సమయపాలన పాటించి శిక్షణలువినియోగించుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది ప్రాథమిక పాఠశాలలు అనేది విద్యార్థులకు పునాది వంటివి, ఈ పాఠశాలను పటిష్టంగా పనిచేసినప్పుడే హైస్కూల్ పాఠశాలలో కూడా అంతే పటిష్టంగా పనిచేస్తాయి కావున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చాలని పిలుపునివ్వడం జరిగింది. అక్కడ జరుగుతున్న శిక్షణపై వివరాలను కోర్స్ డైరెక్టర్ ACMO డి.రాములు గారిని మరియు DRP లకు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏటీడీవో మహబూబాబాద్ ఉపేందర్ , GCDO విజయ, DRP శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ సోమాని, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *