పేరుకుపోయిన మూడవ వార్డు సమస్యలను పరిష్కరించాలి

మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ 3వ వార్డులో గత కొన్ని రోజులుగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి రషీద్ తెలిపారు. పట్టణంలోని మూడవ వార్డు లో వీధి దీపాలు పనిచేయకపోవడం వల్ల రాత్రి సమయంలో రాకపోకలు కష్టంగా మారాయి. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు భయంతో బయటికి రావాల్సి వస్తోంది.
అలాగే సానిటేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. పేరుకుపోయిన చెత్తను సకాలంలో తీసుకెళ్లకపోవడం, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసనతో పాటు దోమలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి అన్నారు.ముఖ్యంగా అంగడి ఆవరణలో చెత్తపెట్టి దుర్వాసన వస్తుందని ప్రజలకు పెద్ద ఇబ్బందిగా మారింది.ఈ సమస్యలపై అధికారులకు పలుమార్లు ఫోన్ చేసి, విన్నపం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిబ్బంది ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు సరి చేయాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *