గ్రామపంచాయతీ ఎన్నికలు – 2025, సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సూచనల ప్రకారం
జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఐదు మండలాలు మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి, మండల కేంద్రాలలో మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, సంబంధిత ఎన్నికల విభాగం మాస్టర్ ట్రైనర్స్ చే ( పి ఓ ) ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది,
నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగిన శిక్షణ తరగతులలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మధుకర్ బాబు కూచిపూడి, హాజరై ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు సలహాలు జారీ చేశారు,
గూడూరు మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో, ఎమ్మార్వో,
కేసముద్రం మండల ప్రత్యేక అధికారి మధుసుదన రాజు,
మహబూబాబాద్ మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం,
ఇనుగుర్తి మండల ప్రత్యేక అధికారిని కృష్ణవేణి, సంబంధిత అన్ని ఎన్నికల విభాగాల అధికారులతో కలిసి స్వయంగా శిక్షణ తరగతులలో
పాల్గొనీ హాజరైన ఎన్నికల విభాగం సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు పాటించవలసిన నియమ నిబంధనలపై క్లుప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది,
ఈ శిక్షణ కార్యక్రమాలను అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, పర్యవేక్షించారు శిక్షణకు హాజరైన, గైహాజరైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.