తొర్రూరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఈదులకుంట తండా, భోజ్యా తండా, హచ్చు తండా,పెద్ద మంగ్య తండా, సోమవరపు కుంట తండా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీమంత్రి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ… 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోసగించిందని తెలిపారు.ప్రస్తుతం జరుగుతున్న సర్వేలు అన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఇందిరా మహిళా శక్తి చీరల పేరుతో మహిళల ఐకేపీ ఖాతాల నుండి డబ్బులు తీసుకుని చీరలు పంచుతూ ప్రజలను మోసగిస్తుందన్నారు. యాసంగి నుండి ఇప్పటివరకు రైతులకు బోనస్ ఇవ్వలేదని, రైతులు రెండు పంటలకు బోనస్ లేకుండానే నార్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ తొర్రూరు మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు మాలోత్ రవి నాయక్, మౌనిక సంతోష్, జాటోత్ రమేష్ నాయక్,గుగులోత్ బిచ్చ,భానోత్ రాజ్ కుమార్, నాయకులు కుమారస్వామి,కాలు నాయక్, కోటి రామ్, యాకన్న, వీరన్న, సుధాకర్, నవీన్, మోహన్, శ్రీను, సోమ్లా, పవన్, బాలాజీ, రాజారాం,యాకేష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.