ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు–డీఎస్పీ కృష్ణ కిషోర్

తొర్రూరు : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు నిబంధనలు పాటించాలని , లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన్ లో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడు తూ..ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జర గాలని, ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు, గుంపులు, తగాదాలు, ఉద్రిక్తతలకు దారితీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పుకార్లు, నిర్ధారణలేని వార్తలు ప్రచారం చేయవద్ద న్నారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
అన్ని పార్టీల నాయకులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గడీల శ్రీనివాస్, సీఐ గణేష్ ఎస్సై ఉపేందర్, సర్పంచు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
Sir namaste sir

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *