మహబూబాబాద్ జిల్లా: ( తొర్రూరు )
నకిలీ తెగుళ్ల మందు వల్లే మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని కొమ్మనపల్లి తండాకు చెందిన గుగులోతు రమేష్ 2 ఎకరాల 20 గుంటల్లో, భూక్య వీరు నాయక్ 2 ఎకరాల 10 గుంటల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు.నెల రోజుల క్రితం తొర్రూరు లోని అన్నదాత ఎరువుల దుకాణంలో ఐపీఎల్ కంపెనీకి చెందిన టెంబో తెగుళ్ల నివారణ మందును ఇరువురు రైతులు కొనుగోలు చేసి పిచికారి చేశారు. తెగుళ్లు,కత్తెర పురుగు బెడద ఉండడంతో ఈ మందును కొనుగోలు చేసి పిచికారి చేశారు. పిచ్చికారీ చేసిన కొద్ది రోజుల్లోనే మొక్కజొన్న ఎదుగు బొదుగు లేక ఎండిపోయింది.ఈ మందు వాడిన రైతుల మొక్కజొన్న పంట ఎండిపోవడంతో రైతులు మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం బాధిత రైతుల మొక్కజొన్న చేనులను ఏవో రాంనర్సయ్య,ఏఈ ఓ వినయ్ వర్మ లు పరిశీలించారు.బాధిత రైతులతో మాట్లాడారు మొక్కజొన్న పంట ఎండిపోయిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని, కెవికె మల్యాల శాస్త్రవేత్తలను పిలిపించి పంట ఎండిపోవడానికి గల కారణాలను తేల్చుతామన్నారు. దాని ప్రకారం ఎరువుల దుకాణం వ్యాపారి ఇచ్చిన తెగుళ్ళ నివారణ మందు వల్లే నష్టం జరిగితే తప్పకుండా నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు పాడ్యా రమేష్, నరేందర్, మంగ్య,భూక్యా మోహన్, మంగ్య, గుగులోతు జాదూ, భాస్కర్,ఎడ్ల వెంకటరెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.