గెలిపిస్తే.. సేవకురాలిగా పనిచేస్తా

అమ్మాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి

తొర్రూరు

ఓట్లు వేసి గెలిపిస్తే.. సేవకురాలిగా పనిచేస్తానని అమ్మాపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ పుట్ బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలు తనకు అవకాశం ఇస్తే అమ్మాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను చూసి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే తన ధ్యేయమని, గ్రామ సమస్యలు తన సమస్యలుగా భావించి పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మాపురం మాజీ సర్పంచ్ కడెం యాకయ్య, మాజీ ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్య, సీనియర్ నాయకులు కడారి జయసింహ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *