కురవి :
పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలు.., వైద్యచికిత్సలు అందజేసిన గుండెవైద్యనిపుణులు డాక్టర్ అశోక్ కుమార్, మెదడు, నరాలవైద్యనిపుణులు డాక్టర్ సాయిహరీష్, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ, రుమటాలజిస్ట్ డాక్టర్ రమణ వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు, ఉచితంగా మందులను అందజేసిన మనధరణి నూతన యాజమాన్యం…ఈ..సందర్భంగా మనధరణి ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ… మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను సామాన్యులకు సహితం అందుబాటు ధరల్లో అందించాలనే సంకల్పంతో మనధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలను అందిస్తుందని తెలిపారు. నూతన యాజమాన్యం అనేకమంది సూపర్ స్పెషాలిస్ట్ వైద్యులను, సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఇకమీదట క్లిష్టమైన వైద్యసేవల కోసం మహానగరాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని, మన మహబూబాబాద్ లోని మన..ధరణి అన్ని రకాల వైద్యసేవలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రసాద్ తెలిపారు. కురవి వీరభద్రస్వామి వారి సన్నిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసామని, భవిష్యత్తు లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తమని ప్రసాద్ ప్రకటించారు