జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు గుండ్రాతి మడుగు (V) విద్యార్థులు

మహబూబాబాద్:

గత నవంబర్ నెల 28,29,30 లలో రంగారెడ్డి లో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైన ZPHS.గుండ్రాతి మడుగు మహబూబాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థిని మారగాని శరణ్య ఎంపిక అయినట్లు గుండ్రాతి మడుగు ప్రధానోపాధ్యాయులు K.Janaiah garu తెలిపారు. ఈ నెల 19 వ తేదీ నుండి మధ్యప్రదేశ్ లో జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో మారగాని శరణ్య ఆడుతున్నట్లు HM గారు తెలిపారు.చదువు తో పాటు క్రీడలలో కూడా రాణించాలని HM సూచించారు. ఈ క్రీడలలో విద్యార్థులను తీర్చి దిద్దిన పిజికల్ డైరెక్టర్ P.కమల్ కిషోర్ గారిని HM గారు అభినందించారు.మరియు ఉపాధ్యాయ బృందం భద్రూ,యాదగిరి, మహేశ్,సురేష్, రమా, శ్రీధర్,రాంసింగ్, బాబు,శోభారాణి మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *