సిపిఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్
మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 17 వ వార్డులోని కేటీఆర్ కాలనీకి రోడ్డు కోసం పులి శ్రీనివాస్ అధ్యక్షతన జనరల్ భాడి సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణ శివారులో 17 వార్డు పరిధిలో KTR కాలనీలో 150 నిరుపేద కుటుంబాలకు నివాసముంటున్నారని కాలాని నుండి బైటికి రావటానికి రోడ్డు దారి గత లేక గత 10సం..రాలనుండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారుకొంతమంది భూ అక్రమదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 281/54 మరియు 281/4 సర్వే నంబర్ల నుండి రహదారి సౌకర్యం కల్పించాలని అనేకసార్లు గత ప్రభుత్వ హయాంలో మరియు ఈ ప్రభుత్వనికి కూడా అనేకసార్లు అధికారులకు దరఖాస్తూ పెట్టుకున్న సమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలమౌతున్నారని అన్నారు..KTR కాలనీ ప్రజలు అనేక రోజులనుండి నడవటానికి దారి ఇవ్వాలని చాలా రోజులనుండి పోరాటాలు చేస్తున్నారని ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు…మహబూబాబాద్ లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇంకా బడా భూస్వాముల దగ్గరే ఉన్నాయని వాటిని సర్వే చేసి వెలికి తీసి పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించాలని డిమాండ్ చేసారు. కాలని ప్రజలకు నడవటానికి రోడ్డు వెంటన్నే ఏర్పాటు చేసి ప్రభుత్వం CC రోడ్డు మంజూరి చేసేంతవరకు సిపిఎం పార్టీ కాలనీ ప్రజల తరుపున పోరాడుతుందని వారికీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి కొండ్రా ఎల్లయ్య, సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీను కాలనీ వాసులు పాల్గున్నారు.