ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్ గా ఎండి అయుబ్ పాషా

శాలువా కప్పి ఘనంగా సన్మానించిన ఉగ్గంపల్లి గ్రామం ధూమ్డా తండా ప్రజలు.

నాకు అత్యధిక మెజారిటీ సాధించి పెట్టిన ధూమ్డా తండా ప్రజలకు, రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చిన సర్పంచ్ ఎండి అయుబ్ పాషా

చిన్న గూడూరు :

ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎండి అయుబ్ పాషా భారీ మెజారిటీతో విజయం సాధించి గ్రామ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు అత్యధిక ఓట్లు వేసి గెలుపు అందించిన ధూమ్డా తండా ప్రజలు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా ధూమ్డా తండాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల మద్దతు, ప్రేమ తనకు మరింత బాధ్యతను పెంచిందని నూతన సర్పంచ్ ఎండి అయుబ్ పాషా అన్నారు.

తన విజయంలో కీలక పాత్ర పోషించిన ధూమ్డా తండా ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారు చూపిన విశ్వాసానికి తగిన విధంగా గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య వంటి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పాలన అందిస్తానని ఎండి అయుబ్ పాషా ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఐక్యతే తన విజయం వెనుక ఉన్న ప్రధాన శక్తి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగ్గంపల్లి గ్రామ ఉపసర్పంచ్ గుగులోత్ అరుణ పట్టయ, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోత్ యాకి నాయక్, వార్డు మెంబర్ బానోత్ వెంకన్న (జెంగు), తండా నాయకులు వెంకన్న, శ్రీపాల్, జానీ,కొమరెల్లి, మాలు, గోపాల్,బాలాజీ,వీరన్న,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *