సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండండి ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండండి డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి పోలీసులం అంటే నమ్మకండి సైబర్ మోసం అని గుర్తిస్తే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు నమోసు చేయండి

— జిల్లా ఎస్పీ డా. శబరీష్.

సైబర్ నేరాల నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని పోలీసు శాఖ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా,
సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాన కల్పించే వివిధ రకాల ఆన్లైన్ మోసాలను సూచించే పోస్టర్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆవిష్కరించారు.

ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలను పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పోలీసు అధికారి కూడా నేరుగా వీడియో కాల్స్ చేయరాని, అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అని గుర్తించాలని అన్నారు.

నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్లను, వెబ్‌సైట్లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పుతూ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా లింకులు పంపి మోసపూరిత వాగ్దానాలతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు అన్నారు.

సైబర్ నేరస్తులు పన్నిన మోసపూరిత ఆఫర్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతి రావు, కృష్ణ కిషోర్, గండ్రతి మోహన్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *