విభజన చట్టం బయ్యారం ఉక్కు పరిశ్రమ కై బిజెపి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
సిపిఐ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి
మహబూబాబాద్ :
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం స్థానిక వీరభవన్ సిపిఐ జిల్లా కార్యాలయంలో కట్లోజు పాండురంగా చారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ కి అవకాశం ఇవ్వాలని, ఉమ్మడి విభజన చట్టం 2014 లో ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై బిజెపి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ప్రారంభించాలన్నారు ప్రజలను కోరారు ముఖ్యంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వార్డు మెంబర్లకు పోటీ చేసిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు అనంతరం సన్మానించారు ఈ సందర్భంగా విజయ సారథి మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల సిపిఐ అనునిత్యం ప్రజల కోసం ఉద్యమిస్తుందన్నారు గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఎర్రజెండా ఉండాలన్నారు ముఖ్యంగా పట్టణ కేంద్రంలో సిపిఐ అనేక ఆందోళనలు ప్రజల కోసం నిర్వహిస్తుందన్నారు కార్మికుల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం ఉద్యోగస్తుల కోసం వ్యాపార వర్గాల కోసం అనునిత్యం ఉద్యమిస్తున్న సిపిఐ అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు మహబూబాబాద్ జిల్లా కోసం ఉద్యమించిన పార్టీ సిపిఐ అన్నారు ఈ ప్రాంతంలో నాడు బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమించామని నేడు రైల్వే పరిశ్రమ కోసం దశలవారీగా ఉద్యమిస్తామని అది సాధించేవరకు పోరాటం ఆగదన్నారు రాబోయే ఎన్నికల్లో సిపిఐ కి అవకాశం ఇవ్వాలని కోరారు
ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి అజయ్ సారధి రెడ్డి నేతలు కట్లోజు పాండురంగ చారి పెరుగు కుమార్ రేషపల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న మామిండ్ల సాంబలక్ష్మి తండా సందీప్ చొప్పరి శేఖర్ బైసా స్వామి బానోత్ లింగ్య నాయక్ వీరవెల్లి రవి వెలుగు శ్రావణ్ ఎండి ఫాతిమా మేక వీరన్న జలగం ప్రవీణ్ ఆబోతు అశోక్ కేదాసు రమేష్ వంకాయలపాటి చిరంజీవి తూటి వెంకటరెడ్డి చిర సత్యనారాయణ మంద భాస్కర్ కమటం ఉపేందర్ గెలిచినవార్డు మెంబర్లు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు శాఖల కార్యదర్శిలు పాల్గొన్నారు